పుష్కరాల కోసం నిధులు విడుదల | Funds released for Godavari pushkaralu, says Murali Mohan | Sakshi
Sakshi News home page

పుష్కరాల కోసం నిధులు విడుదల

Dec 12 2014 12:53 PM | Updated on Sep 2 2017 6:04 PM

పుష్కరాల కోసం నిధులు విడుదల

పుష్కరాల కోసం నిధులు విడుదల

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ వెల్లడించారు.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడుతో కలసి మురళీమోహన్ మాట్లాడుతూ... రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేందుకు అనుమతించాలని పౌర విమానయానశాఖను ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాజమండ్రి - కోవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతుకు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... బలవంతపు మతమార్పిడులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని గుర్తు చేశారు. కాని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్నే చేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement