breaking news
srikakulam mp
-
టీడీపీ ఎంపీ దౌర్జన్యం
శ్రీకాకుళం : స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు కె.రామ్మోహన్నాయుడు మంగళవారం దౌర్జన్యానికి దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో గ్రామ కంఠాల భూ కబ్జాకు యత్నించారు. అందులోభాగంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్థలం పక్కనే ఉన్న భూమిలో నిర్మాణం జరగుతున్న ఇల్లును కూల్చివేశారు. అయితే ఎంపీ రామ్మోహన్ గతంలో తన స్థలం అడిగారని... అందుకు తాను నిరాకరించానని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీ రామ్మోహన్నాయుడు దౌర్జన్యానికి దిగారని బాధితుడు ఆరోపించారు. గ్రామకంఠం కింద ఎంపీ రామ్మోహన్నాయుడుకు శ్రీకాకుళంలో 40 సెంట్ల స్థలం ఉంది. అలాగే రెండు, మూడు సెంట్ల గ్రామ కంఠానికి చెందిన స్థలంలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఆ భూములు విక్రయించాలని ఎంపీ... స్థానికులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు వారు ససేమీరా అన్నారు. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ స్థానిక ఎమ్మార్వో చెప్పడంతో.. స్థానికులు కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ క్రమంలో రామ్మోహన్రావు రంగంలోకి దిగారు. -
పుష్కరాల కోసం నిధులు విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడుతో కలసి మురళీమోహన్ మాట్లాడుతూ... రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేందుకు అనుమతించాలని పౌర విమానయానశాఖను ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాజమండ్రి - కోవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతుకు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... బలవంతపు మతమార్పిడులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని గుర్తు చేశారు. కాని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్‌నే చేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.