
జెనీవా: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత్ మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తన ధృఢవైఖరిని ప్రకటించింది. పీఓకేకు పాకిస్తాన్ స్వేచ్ఛను ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ (యూపీఆర్) కమిటీ ముందు భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ పీఓకేలో హింసను తక్షణం ఆపాలని, ముస్లిం మైనారిటీలపై దాడులను నిలిపివేయాలని, మానవహక్కులను కాపాడాలని భారత్ యూపీఆర్‌లో డిమాండ్ చేసింది. ఇకనైనా పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ ప్రజలను వేధించడం మానుకోవాలని భారత్ స్పష్టం చేసింది.
జెనీవాలో నవంబర్ 13న జరిగిన మూడో యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ సామావేశంలో పీఓకే విషయంలో భారత్ తన ధృఢ వైఖరిని మరోమారు స్పష్టం చేసింది.
భారత్ ప్రధాన డిమాండ్లు ఇవే
- ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్ జోన్లను పాకిస్తాన్ వెంటనే ధ్వంసం చేయాలి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
- మిలటరీ కోర్టు తీర్పుల నుంచి పఘాకే పౌరులకు మినహాయింపులు ఇవ్వాలి. ఆక్రమిత కశ్మీర్‌లో అంతర్జాతీయ మానవహక్కుల పరిశీలకులకు ప్రవేశం కల్పించాలి.
- పీఓకేలోని ముస్లి, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పించాలి.
- హిందు, క్రైస్తవ, సిక్కులను పెళ్లి పేరుతో చేస్తున్న మత మార్పిడులపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి.
- బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ప్రాంతాల్లో రాజకీయ విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని పాకిస్తాన్ తక్షణం ఆపాలి.
India's Statement
— India at UN, Geneva (@IndiaUNGeneva) 13 November 2017
on the Universal Periodic Review of Pakistan pic.twitter.com/LXEgO2SFom