నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం | Four-year-old boy raped by teenager in Haryana | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం

Feb 27 2016 8:04 PM | Updated on Apr 7 2019 4:36 PM

నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం - Sakshi

నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం

హర్యానాలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది.

గుర్గావ్: హర్యానాలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై ఓ టీనేజీ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్లో నివసించే నాలుగేళ్ల బాలుడిపై పదిహేనేళ్ల కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొరుగింట్లో ఉండే యువకుడు ఒంటరిగా ఉన్న బాలున్ని ప్రలోభపెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

అత్యాచారానికి గురైన బాలుడి సోదరుడితో నిందితుడు చనువుగా ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లి పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం బయటకు రావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిపై లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement