మోదీజీ.. మీ తండ్రి పేరేంటి..? | Former Cabinet Minister Has Apparently Asked The Prime Minister The Name Of His Father | Sakshi
Sakshi News home page

మోదీజీ.. మీ తండ్రి పేరేంటి..?

Nov 25 2018 4:05 PM | Updated on Nov 25 2018 4:09 PM

Former Cabinet Minister Has Apparently Asked The Prime Minister The Name Of His Father - Sakshi

మోదీ తండ్రి పేరేంటో ఎవరికీ తెలియదన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత..

ముంబై : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీల అగ్రనేతల కుటుంబ మూలాలపై ప్రశ్నలు సంధిస్తూ ప్రచారాన్ని వ్యక్తిగత స్ధాయికి దిగజార్చుతున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత విలాస్‌రావు ముత్తెంవార్‌ ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి పేరు వెల్లడించాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు.

రాహుల్‌ గాంధీ తండ్రి ఎవరో, అమ్మమ్మ ఎవరో ప్రపంచానికి తెలుసని, మోదీ తం‍డ్రి ఎవరో ఏ ఒక్కరికీ తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గురించి పుట్టుపూర్వోత్తరాలు, ఆయన కుటుంబానికి చెందిన ఇందిరా గాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సహా అయిదు తరాల వారు అందరికీ తెలిసినా, మోదీ తండ్రి గురించి ఏ ఒక్కరికీ ఏమీ తెలియదని అన్నారు. మోదీ తండ్రిని గురించి ప్రశ్నిస్తూ విలాస్‌రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను  బీజేపీ జాతీయ ఐటి, టెక్నాలజీ విభాగం ఇన్‌చార్జ్‌ అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement