ఉపాధి అవకాశాలపై ఈపీఎఫ్‌ఓ నివేదిక | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలపై ఈపీఎఫ్‌ఓ నివేదిక

Published Fri, Jun 12 2020 7:20 PM

Formal Employment In India Raise Twenty Eight Percent Says EPFO - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రంగాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నివేదిక విడుదల చేసింది. కాగా 50 శాతం ఉపాధి అవకాశాలను ఆతిథ్య రంగం, ఆర్థిక సంస్థలు కల్పించినట్లు పేర్కొంది. (2019-20) ఆర్థిక సంవత్సరానికి సంఘటిత రంగం 28.6శాతం ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించినట్లు తెలిపింది. కాగా, అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేందుకు ప్రభుత్వ కీలక సంస్కరణలు, జీఎస్‌టీ అంశాలు తోడ్పడ్డాయని అభిప్రాయపడింది.

అయితే ఎక్కువ శాతం ఉద్యోగులు సంఘటిత రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తక్కువ సంఖ్యలో అసంఘటిక రంగానికి ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ అధికారి సునీల్‌ బర్తవాల్‌ పేర్కొన్నారు. జీఎస్‌టీ సంస్కరణల వల్ల వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు పెరిగినట్లు పేర్కొంది.  నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్‌ నుంచి ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు)

Advertisement

తప్పక చదవండి

Advertisement