కేరళ ప్రజలపై ‘వరద పన్ను’

Flood Cess Comes into Effect in Kerala - Sakshi

తిరువనంతపురం: గత ఏడాది ఆగస్టు నెలలో భారీ వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణానికి అదనపు ఆదాయాన్ని సమీకరించడానికి ప్రజలపై వరద పన్ను విధించేందుకు 2019–20 బడ్జెట్‌లో కేరళ ప్రభుత్వం తీర్మానించింది. ఈ నిర్ణయంతో గురువారం నుంచి వస్తు సేవలపై ఒక శాతం పన్ను విధింపు అమల్లోకి వచ్చింది. రాబోయే రెండేళ్ల కాలానికి అమల్లోకి వచ్చే ‘కేరళ ఫ్లడ్‌ సెస్‌’ ద్వారా ఏటా రూ. 600 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం దృష్టి సారించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త పన్ను ద్వారా సమీకరించిన మొత్తం రాష్ట్ర పునర్నిర్మాణం, వరద బాధితులకు పరిహారం చెల్లించడానికి ఉపయోగిస్తారు.

వరద పన్నుతో కేరళలో 900 రకాల నిత్యవసర సరుకుల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరల వర్తకుల సంఘం నిన్న ‘బ్లాక్‌డే’ పాటించింది. ద్రవ్యోల్బణం, వరద పన్నుతో రాష్ట్ర ప్రజలపై రూ. 1200 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల అన్నారు. వరద బాధితుల కోసం మిగతా వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వరద పన్నును సాకుగా చూపించి ఇష్టమొచ్చినట్టు ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను ఆర్థిక​ మంత్రి థామస్‌ ఐజాక్‌ హెచ్చరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top