ఎన్నికల ప్రచార ర్యాలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు బొమ్మ విమానాలు, హెలికాప్టర్లతో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్(యూపీ) పోలీసులు హెచ్చరించారు.
యూపీ పోలీసుల హెచ్చరిక.. రాష్ట్రంలో హైఅలర్ట్
ఘజియాబాద్: ఎన్నికల ప్రచార ర్యాలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు బొమ్మ విమానాలు, హెలికాప్టర్లతో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్(యూపీ) పోలీసులు హెచ్చరించారు. ఆయా ర్యాలీల్లో పాల్గొనే వివిధ పార్టీల ప్రధాన నేతలపై ఉగ్రమూకలు కుట్రపన్నినట్టుగా సమాచారం ఉందని వెల్లడించారు.
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రిమోట్ సాయంతో ఎగిరే బొమ్మ విమానాలు, హెలికాప్టర్లను అమ్మే దుకాణ దారులకు.. కొనుగోలు దారుల పూర్తి వివరాలను రికార్డు చేయాలని, అనుమానితుల సమాచారం తక్షణమే పోలీసులకు అందించాలని ఆదేశించారు. యూపీ సహా ఢిల్లీ పరిసరాల్లోని బొమ్మ దుకాణదార్లను సైతం హెచ్చరించినట్టు అధికారి ఒకరు చెప్పారు.