కాబోయే మామ ముద్దుతో పెళ్లి రద్దు | Father-in-law kisses girl, bride returns baraat | Sakshi
Sakshi News home page

కాబోయే మామ ముద్దుతో పెళ్లి రద్దు

May 29 2015 2:30 PM | Updated on Sep 3 2017 2:54 AM

కాబోయే మామ ముద్దుతో పెళ్లి రద్దు

కాబోయే మామ ముద్దుతో పెళ్లి రద్దు

ఆత్మగౌరం తప్ప మరేదీ ముఖ్యం కాదంటూ వరుడు, అతడి కుటుంబం నచ్చకుంటే.. పచ్చని పందిట్లో సైతం పెళ్లికి నిరాకరిస్తున్న ఉత్తరప్రదేశ్ యువతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ఆత్మగౌరం తప్ప మరేదీ ముఖ్యం కాదంటూ వరుడు, అతడి కుటుంబం నచ్చకుంటే.. పచ్చని పందిట్లో సైతం పెళ్లికి నిరాకరిస్తున్న ఉత్తరప్రదేశ్ యువతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా కాన్పూర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కాబోయే మామగారి ముద్దు వ్యవహారంతో చిర్రెత్తిన వధువు పెళ్లికి నో చెప్పడంతోపాటు అతనికి బుద్ధిచెప్పి పంపింది.

యూపీలోని ఫరూఖాబాద్ జిల్లా నాగల్ఖైర్బాంద్ గ్రామానికి చెందిన రిచా వివాహం ఈథా జిల్లా నెహ్రూనగర్కు చెందిన రాజేశ్తో నిశ్చయమైంది. ముహుర్తం ప్రకారం గురువారం రాత్రి పెళ్లి జరగాల్సిఉంది. అంతకు కొద్దిగంటలు ముందు నిర్వహించిన జైమాల్ కార్యక్రమంలో పాల్గొన్న ఇరుపక్షాలు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశాయి. సందట్లో సడేమియాలా వరుడి తండ్రి బాబురాం వధువు సహోదరికి చటుక్కున ముద్దుపెట్టాడు. అంతే ఆ పెద్దమనిషి చర్యతో అక్కడున్నవాళ్లంతా బిత్తరపోయారు.

వధువు రిచాకు మాత్రం కాబోయే మామగారి నిర్వాకంతో కోపం నషాళానికెక్కింది. ఒక్క ఉదుటన మెడలోని పూల దండను తెంపేసి మామను నిలదీసింది. 'మీలాంటి బుద్ధితక్కువ మనుషుల ఇంటికి కోడలిగా రాను. ఇంతటితో ఈ పెళ్లి ఆగిపోయింది' అని తేల్చిచెప్పింది. అప్పటికే అతడి చర్యతో కొపంతో రగిలిపోయిన వధువు తరఫు బందువులు బాబూరామ్కు దేహశుద్ది చేశారు. అతనితోపాటు వరుణ్ని కూడా కట్టేసి పెళ్లి ఖర్చులు నయాపైస సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.

క్షమాపణలు చెప్పడంతోపాటు డబ్బు చెల్లించిన వరుడు, అతని తండ్రి తమ ఊరి వైపు పరుగుపుచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లింటికి వచ్చినప్పటికీ ఇరుపక్షాలు ఓ అంగీకారానికి రావడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండా వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement