భారీ వర్ష సూచన.. రెడ్‌అలర్ట్ ప్రకటన

కేరళకు భారీ వర్ష సూచన
తిరువనంతపురం: భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ముందుస్తు జాగ్రత్తగా హైఅలర్ట్ ప్రకటించారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించిన వరద బీభత్సం.. ఎంతో మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులంతా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అలాగే ఇడుక్కి, వయనాడ్, కానూర్, ఎర్నాకులం, త్రిసూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. కాగా వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కేరళను వరదలు ముంచెత్తిన విషయం విదితమే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి