జార్ఖండ్‌ : బాణాసంచా కర్మాగారంలో పేలుడు | Explosion at firecracker factory | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ : బాణాసంచా కర్మాగారంలో పేలుడు

Sep 25 2017 8:45 AM | Updated on Sep 25 2017 9:52 AM

Explosion at firecracker factory

సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లోని బాణాసంచా కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం కుమారడుబిలోని బాణాసంచా కర్మాగారంలో తీవ్రమైన పేలుడు సంభవించింది. వెంటనే మంటలు వ్యాపించడం.. పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న 5మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రగాగాయలతో ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కార్మికలు, ఇతరులు ఉన్నారు. లొపల బాణాసంచా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement