నేతాజీ అన్న కుమారుడు కన్నుమూత


కోల్కతా: సుభాష్ చంద్రబోస్ అన్న కుమారుడు, మాజీ ఎంపీ సుబ్రతా బోస్ మృతి చెందారు. దక్షిణ కోల్కతాలోని తన నివాసంలో సుబ్రతా బోస్ గతరాత్రి గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు వెల్లడించారు.   చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారు. సుబ్రతా బోస్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top