కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్ 10తో ముగియనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 5వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి.
కాగా నిమినేషన్లను జూలై 4వ తేదీ నుంచి స్వీకరిస్తారు. అలాగే నామినేషన్లు దాఖలుకు 18వ తేదీతో గడువు ముగియనుంది. ఉపసంహరణకు జూలై 21 చివరి తేది. ఇక రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.