ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా ఉపయెగించుకు నేందుకు వీలుగా పునరుత్పత్తి చేసేందుకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఎకో పార్కును ఏర్పాటు
పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకు కేంద్రం పరిశీలిస్తోంది: పర్యావరణ శాఖ
న్యూఢిల్లీ: ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా ఉపయెగించుకు నేందుకు వీలుగా పునరుత్పత్తి చేసేందుకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఎకో పార్కును ఏర్పాటు సాధ్యా సాధ్యాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ ఓ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది. ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలంటే పర్యావరణ అనుకూల (ఎకో)పార్కును ఏర్పాటు చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శిక్షణ పరికరాలు సమ కూర్చాల్సి ఉంటుందని క్రేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపినట్లు పర్యావరణ శాఖ చెప్పింది. ఎకోపార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఈ–వేస్ట్‌ను పర్యావరణహితంగా తయారు చేయొచ్చని పేర్కొంది. ప్రమాదకరమైన వస్తువుల నిర్వహణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఓ స్కీం ఉందని, అందులో ఈ–వేస్ట్‌ను పునరుత్పత్తి చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తాయని తెలిపింది.