breaking news
Eco Park
-
మనసు దోచే మయూరి గార్డెన్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పర్యాటక పరంగా మహబూబ్‌నగర్ జిల్లా దూసుకెళ్తోంది. మయూరి నర్సరీ నుంచి మయూరి ఎకో అర్బన్ పార్క్‌గా రూపాంతరం చెందిన మహా వనమే ఇందుకు నిదర్శనం. 2,087 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని పరుచుకుని ఆహ్లాదం పంచుతోంది. చిన్నపిల్లల నుంచి మహిళలు, పురుషులు తేడా లేకుండా వృద్ధులు.. ఇలా అన్నివర్గాల వారికి వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సాహస క్రీడలకు వేదికగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అద్భుతమైన పిక్నిక్ స్పాట్‌గా విరాజిల్లుతున్న సహజసిద్ధ వనక్షేత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. » మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి సమీపంలో మయూరి ఎకో అర్బన్ పార్క్‌కు 2015 జూన్ 3న శంకుస్థాపన చేశారు. 2017 ఏప్రిల్ 17న ప్రారంభించిన ఈ పార్క్ పర్యాటకులతో నిత్యం సందడి చేస్తోంది. సెలవు, వారాంతపు రోజుల్లో మరీ ఎక్కువగా పర్యాటకుల తాకిడితో కళకళలాడుతోంది. రాష్ట్రంలోని పెద్ద నగరాలతో పాటు కర్ణాటక, ఏపీ నుంచి పర్యాటకులు.. మయూరి అర్బన్ ఎకో పార్కును సందర్శిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. » పర్యాటకులు సేదదీరేందుకు ఏర్పాటు చేసిన పచ్చదనం.. తివాచీని తలపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు గార్డెన్లో కూర్చొని సేదదీరుతున్నారు. యోగా చేసుకునే వారికి పార్క్‌లో ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. రోజూ ఇక్కడికి వందలాది మంది వచ్చి యోగ సాధన చేసుకునేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పార్క్‌లో చిన్నారు లు, పెద్దలకు ప్రత్యేకంగా ఓపెన్ ఎయిర్ జిమ్ ఏ ర్పాటు చేశారు. వివిధ రకాల వ్యాయామాలకు ఆరు పరికరాలను సమకూర్చారు. వెయిస్ట్ టర్న్ ట్విస్టర్, సిట్ అప్ బెంచ్, రోవర్, బాక్ పుల్ డౌన్, రైడర్, హెల్త్ వాకర్ ఉన్నాయి. సీతాకోకచిలుకల గార్డెన్ ప్రవేశద్వారం ఎదుట మొదట కనిపించేది బట్టర్ఫ్లై గార్డెన్. ఇందులో ఎన్నో రకాల మొక్కలు నాటారు. గతంలో నాటినవి.. ఇప్పుడు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. సీతాకోకచిలుకలను ఆకట్టుకునేలా స్వర్ణ గన్నేరు, పారిజాతం, విష్ణుశంఖం, మందారం వంటి 45 రకాల మొక్కలు ఉన్నాయి. 12 రాశులు.. 12 మొక్కలు తెలుగు రాశులు 12 ఉంటాయి. ఈ మేరకు పార్క్‌లో రాశి నవగ్రహ వనం ఏర్పాటు చేశారు. రాశుల పేర్లతోపాటు మొక్కలు వాటి సాంస్కృతిక నామాలను బోర్డుపై కనిపించేలా రాశారు. ఏడాకుల పాలు (వృషభం), అశోక/వెదురు (మిథునం), ఎర్రచందనం (మేషం), మర్రి (మీనం), జమ్మి (కుంభం), సిస్సు (మకరం), రావి (ధనస్సు), సండ్ల (వృశి్చకం), పొగడ (తుల), మామిడి (కన్య), రేగు (సింహం), మోదుగల (కర్కాటకం) నాటారు. అడల్ట్ వాటర్ బోటింగ్ పార్క్ చివరి భాగంలో చెక్‌డ్యాం నిర్మించి అందులో వాటర్ బోటింగ్ ఏర్పాటు చేశారు. బోటింగ్‌కు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇద్దరు కూర్చుని సైకిల్లా తొక్కుతూ ముందుకు సాగవచ్చు. పచ్చని అందాల మధ్య నీటిలో విహారం ప్రత్యేక అనుభూతి మిగులుస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. పది నిమిషాలకు ఒక్కొక్కరికి పది నిమిషాలకు రూ.100 వసూలు చేస్తున్నారు. పల్లె వాతావరణం ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో నే విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల పై వారికి అవగాహన కరువవుతోంది. ఈ నేపథ్యంలో పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ పర్యాటకులకు ఆకట్టుకుంటోంది. మనిషి ఎద్దులబండిని నడిపేలా చిత్రం, వీటి వెనుక గుడిసె, చేదు డుబావి ఏర్పాటు చేశారు. వెదురు ఉత్పత్తులతో తయారు చేసిన వన కుటీరం అమితంగా ఆకట్టుకుంటోంది. రెయిన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ అద్భుతం పార్క్‌లో రెయిన్ ఫారెస్ట్ ప్రత్యేక అనుభూతిని మిగులుస్తోంది. సహజసిద్ధ వాతావరణంలో వర్షం పడుతున్నట్లు కృత్రిమంగా ఏర్పాటు చేశారు. చెరువు నుంచి పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేసేలా ప్రత్యేకమైన సెట్టింగ్ ఏర్పాటు చేయడం ఆకర్షిస్తోంది. గుట్టపై జాలువారుతున్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెరువు నుంచి పైకి నీళ్లు పంపింగ్ చేసి.. అక్కడ నిల్వ చేసి.. వదిలిపెడుతున్నారు. ఇలా ఏర్పడిన వాటర్ ఫాల్స్ సందర్శకులను మైమరిపింపజేస్తోంది. సాహస విన్యాసాలకు వేదిక మయూరి ఎకో అర్బన్ పార్క్ సాహస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. రూ.50తో టైర్ బ్రిడ్జి, బాంబో బ్రిడ్జి, వాల్ క్లైంబింగ్ చేయవచ్చు. రూ.200తో సైక్లింగ్, రూ.100తో జిప్‌లైన్, వర్షాకాలం తర్వాత ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. యువకులు, విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా ఈ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. కరెన్సీ పార్క్ వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను వృత్తాకారంలో ఏర్పాటు చేశారు. ఒక్కో కరెన్సీ నోటు వద్ద సంబంధిత దేశం పేరు, ఏమని పలకాలో వివరంగా రాశారు. భారతదేశం, ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, క్యూబా, వెనిజులా దేశాలకు చెందిన కరెన్సీ నోట్ల వివరాలు పిల్లలు గుర్తుంచుకునేలా ఏర్పాటు చేశారు. క్రీడాభిమానుల వేదిక ఆర్చరీ జోన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆర్చరీ జోన్ క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. సెలవుల్లో మినహా రోజూ ఇది అందుబాటులో ఉంటోంది. ఈ ఆర్చరీ జోన్లో ఐదు విల్లులు కొట్టడానికి రూ.50 వసూలు చేస్తారు. ఏటా వేసవిలో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్చరీ శిక్షణ ఇస్తున్నారు. జంగిల్ సఫారీ మయూరి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీకి అవకాశముంది. అందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక ట్రిప్‌కు రూ.2వేల చార్జితో ఎనిమిది మంది వరకు వాహనంలో అడవి మొత్తం చుట్టి రావొచ్చు. అడవి జంతువులతోపాటు రకరకాల చెట్లను చూడవచ్చు. నైట్ క్యాంపింగ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఎకో పార్క్‌లో ఒకరోజు, రాత్రివేళలో ప్రత్యేక నైట్ క్యాంపింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి రూ.1,500 ప్యాకేజీతో డిన్నర్, భోజనంతో పాటు హైకింగ్ ఫారెస్ట్, జిప్‌లైన్ అండ్ రోప్ విన్యాసాలు, రెయిన్ ఫారెస్ట్, వాటర్‌ఫాల్, జిప్ సైక్లింగ్‌కు అవకాశం కల్పించారు. కొంతకాలంగా ఈ ప్యాకేజీ కొనసాగడం లేదు. త్వరలో పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే.. మయూరి ఎకో అర్బన్ పార్క్‌లో ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్ పార్క్‌కు అన్ని హంగులు అద్దారు. చూడగానే ఆకట్టుకునేలా పార్క్ ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. లోపలికి ప్రవేశించారో.. లేదో.. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే. జారుబండలు, ఊయలలు, రోలింగ్, టైర్ స్వింగ్, అప్ అండ్ డౌన్ బల్లలు, అంబరిల్లా ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. కోతులు, చింపాంజీల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల వాటర్ బోటింగ్‌కు విశేష స్పందన వస్తోంది. వాటర్ బోటింగ్‌కు 10 నిమిషాలకు రూ.50 చార్జి వసూలు చేస్తున్నారు.‘మకావ్’అదరహో.. పార్క్‌లో ఏర్పాటు చేసిన చిలుక జాతికి చెందిన గ్రీన్వింగ్డ్ మకావ్ పక్షి సందర్శకులను ఆకట్టుకుంటోంది. దక్షిణ అమెరికా అడవుల్లో గుంపులుగా నివసించే ఈ పక్షిని ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. ఈ పక్షి జీవితకాలం 60 నుంచి 80 ఏళ్లు అంటూ వివరాలు తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయడంతో.. పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం అందుతోంది. బ్లాక్ అండ్ వైట్ స్వాన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కొలనులో నలుపు, తెలుపు రంగుల హంసల సందడి ఆకట్టుకుంటోంది. ఆ్రస్టేలియా ఖండానికి చెందిన ఈ హంసలు ఎక్కువ సేపు నీటిమీద విహరిస్తూ గడుపుతాయి. ఆకులు, గింజలు వీటి ఆహారం. జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్లు అన్న వివరాలను బోర్డుపై రాసి పెట్టారు. చెట్ల మధ్య నడక వంతెన పార్క్ మధ్యభాగంలో ఏర్పాటు చేసిన నడక వంతెన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పక్క నడక వంతెన ఎక్కి.. మరోచోట దిగేలా ఏర్పాటు చేశారు. ఈ నడక వంతెనపై చిన్నారులతోపాటు పెద్దలు వాకింగ్ చేస్తున్నారు. వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైనోసర్ల ప్రతిమలు అలరిస్తున్నాయి. పార్క్‌లో భారీ పరిమాణంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ఆకట్టుకుంటోంది. చుట్టూ నాటిన వివిధ రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎంత పెద్ద ఆ్రస్టిచ్ పక్షులో.. అర్బన్ పార్క్కే హైలెట్‌గా ఆ్రస్టిచ్ పక్షులు నిలుస్తున్నాయి. పొడవైన కాళ్లు, భారీ ఆకారంతో కూడిన ఆ్రస్టిచ్ పక్షులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా అడవుల్లో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి గుడ్డు 32 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. బరువు కిలో 400 గ్రాములు ఉంటుంది.. అన్న వివరాలు ఉన్నాయి. మూడు వ్యూ పాయింట్లు పార్క్‌లో మూడు వ్యూ పాయింట్లు ఉన్నా యి. హిల్ వ్యూపాయింట్, ఫ్లాగ్ పాయింట్‌తో పాటు మరో సాధారణ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. హిల్ వ్యూపాయింట్ నుంచి చూస్తే ఇటు పక్క జడ్చర్ల, మరోపక్క మహబూబ్‌నగర్ రహదారి అద్భుతంగా కనిపిస్తోంది. వ్యూ పాయింట్లో పార్క్ అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఫొటో షూట్లకు క్రేజీ మయూరి ఎకో అర్బన్ పార్క్ ఫొటో షూట్‌కు వేదికగా నిలుస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకునేవారు, చేసుకున్న జంటలు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాల మధ్య ఫొటోలు తీసుకుంటుండడంతో సందడి నెలకొంటోంది.ఆహ్లాదంగా ఉంది సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి పార్క్‌కు వస్తుంటాం. పార్క్ రోజురో జుకూ అభివృద్ధి చెందుతోంది. పా ర్క్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దలు సంతోషంగా గడిపేందుకు అవకాశముంది. – రాజేశ్వర్, ఉపాధ్యాయుడుపిల్లలకు చూపాలి చి్రల్డన్ పార్కులో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లు, బొమ్మలు కచి్చతంగా పిల్లలకు చూపాలి. సీతాకోక చిలుకల గార్డెన్లో రకరకాల మొక్కలు, వాటి పేర్లు తెలియడంతో విజ్ఞానం పెరుగుతుంది. సెలవులు ఉంటే తప్పకుండా మా పిల్లలతో ఇక్కడికొస్తాం. – శంకర్, మహమ్మదాబాద్ హైదరాబాద్ తరహాలో.. హైదరాబాద్‌లోని పార్క్‌ల తరహాలో ఇక్కడే పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పచ్చదనంతో కూడిన పార్క్ అందాలు చాలా బాగున్నాయి. జీవితంలో గుర్తుండిపోయేలా ఉంది. పిల్లలకు ఆడుకునేందుకు, విజ్ఞానం పొందేందుకు ఇక్కడి ఏర్పాట్లు బాగున్నాయి. – దీపిక, మహబూబ్‌నగర్ రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాట్లు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటుతోపాటు రాక్ గార్డెన్, కాక్టస్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. త్వరలో ఏర్పాటు చేసి పర్యావరణ విద్యపై శిక్షకుడిని ఏర్పాటు చేసి పార్కుకు వచ్చే సందర్శకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. – వాసవి, అటవీ సెక్షన్ ఆఫీసర్ -
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఎకోపార్కు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన కొత్వాల్‌గూడ ఎకో పార్కు (Kothwalguda Eco Park) ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. హిమాయత్‌సాగర్‌కు చేరువలో, ఔటర్‌రింగ్ రోడ్డు అంచుల్లో ఆకుపచ్చ అందాలతో పార్కు రూపుదిద్దుకుంటోంది. 2022 అక్టోబర్‌లో 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.75 కోట్ల అంచనాలతో ప్రభుత్వం ఎకో పార్కు నిర్మాణం చేపట్టింది. ఎన్నో వైవిధ్యభరితమైన ప్రత్యేకతలతో ఏర్పాటు చేస్తోన్న కొత్వాల్‌గూడ ఎకోపార్కును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితర ఉన్నతాధికారులు శుక్రవారం సందర్శించారు.పంద్రాగస్టు నాటికి పార్కును ప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. పార్కు ప్రవేశ ద్వారం వద్ద వెదురు అల్లికలతో అందమైన ఆర్చ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సహజత్వం ఉట్టిపడేలా ఈ ఆర్చ్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వెదురును థాయ్‌లాండ్ నుంచి తెప్పించనున్నారు. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వెదురు అల్లికల ఆర్ట్ పని పూర్తి కాగానే పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు.. ⇒ ఇటు ఐటీ కారిడార్ల నుంచి అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న వివిధ కాలనీలు, ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఒక అద్భుతమైన ఆటవిడుపు.⇒ అందమైన కాలక్షేపంగా ఎకో పార్కు కనువిందు చేయనుంది. పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి వేడుకలకు అవసరమైన వేదికలు, లగ్జరీ సదుపాయాలతో దీన్ని రూపొందించారు.⇒ పార్కులో ఏర్పాటు చేసిన ఏవియరి (పక్షుల గ్యాలరీ) సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. రకరకాల పక్షుల కిలకిలలతో ఆహ్లాదాన్ని పంచేవిధంగా దీన్ని ఏర్పాటు చేశారు.⇒ 2.5 కి.మీ.లతో ఎలివేటెడ్ వాక్ వేలను నిర్మించారు. నగరవాసులు ఉదయం, సాయంత్రం ఈ వాక్‌వేలపై నడకకు వెళ్లవచ్చు. విశాలమైన పచ్చిక బయళ్లతో పాటు, అందమైన పూల వనాలను ఏర్పాటు చేశారు. బటర్‌ఫ్లై పార్కు మరో ప్రత్యేకత. సీజనల్ ఉద్యాన వనాలు మరో ప్రత్యేకత. చదవండి: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి! -
Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)
-
వందల ఏళ్ల రక్షణ స్థావరం.. రామగిరి కోట!
అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. తెలంగాణలో తొలిసారిగా రోప్‌వే పర్యాటకానికి అవకాశం కల్పించింది. భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై 2 కిలోమీటర్ల రోప్‌వేను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రంలో మరో నాలుగు ప్రతిపాదిత రోప్‌వేలలో పెద్దపల్లి జిల్లా రామగిరి కోటకు చోటు కల్పించారు. – మంథనిప్రాచీన శిల్పకళా సంపదకు చిరునామా.. రామగిరి ఖిలా జిల్లాలోని రామగిరి ఖిలాను జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. రామగిరి ఖిలా (Ramagiri fort) క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రామగిరి కోటగా రూ పుదిద్దుకుంది. ఈ కోట శత్రుదుర్భేద్యమైన రక్షణ స్థావరంగా వందల ఏళ్లపాటు వివిధ వంశాల రాజులకు ఆశ్రయమిచ్చింది. ఎంతో ఎత్తున్న దుర్గం, అనేక రాతి కట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్శాల, చెరసాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి.తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి.. వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. సీతమ్మ కొలను గుంటపై పసుపు, ఎరుపు రంగు నీరు దర్శనమివ్వడం విశేషం. పిల్లల ఫిరంగి నుంచి దూరితే సంతానప్రాప్తి లభిస్తుందని పర్యాటకుల విశ్వాసం. రామగిరి ఖిలాపై సుందర దృశ్యాలు, ప్రాకారాలు.. సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలున్న స్థలంలో కొండ చరియకింద వెయ్యిమంది తలదాచుకోవచ్చు.రామగిరి కోటలో ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసకాలంలో రామగిరికోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి కొండపై నుంచి వచ్చే నీటిధార.. బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ద్వా రం వద్ద సీతాదేవి స్నానమాచరించినట్లు భక్తుల నమ్మకం. కొండపై సీతారాముల విగ్రహాలతో పాటు నంది విగ్ర హం ఉంది. నీటిధార నేరుగా శివలింగం, నంది విగ్రహాలపై పడటం విశేషం. రామగిరి కొండ పైనుంచి వర్షాకాలం జలపాతాలు కనువిందు చేస్తాయి. రోప్‌వే (Rope Way) ద్వారా పర్యాటకుల్ని గుట్టపైకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే.. రామగిరి ఖిలాకు పర్యాటకుల సందడి పెరగనుంది.లోయలాంటి సరస్సు ఎల్‌మడుగు గోదావరి నది మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోయలాంటి సరస్సే ఎల్‌మడుగు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య మంథని మండలం ఖాన్సాయిపేట – శివ్వారం అటవీ ప్రాంతంలోని ఎల్‌మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. ఈ సరస్సు చుట్టూ ఆనుకున్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండలు, గుట్టలు.. రెండు కొండల మధ్యనుంచి ప్రవహించే గోదావరి నది.. ఆ సరస్సులో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు, నీటిలో ఎగిరే చేపల విన్యాసాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న చేపపిల్లలు గుంపుగా కదులుతున్న దృశ్యం.. కళ్లెదుటే ఆక్వేరియం ఉన్నట్టు అనిపిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఈ సరస్సులో.. ఈ సుందర దృశ్యాలను కచ్చితంగా చూడాల్సిందే అనడం అతిశయోక్తి లేదు.ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎల్‌మడుగును ఇకో పార్కుగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటికే మంథని (Manthani) మండలం ఖానాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ.115 కోట్లు, మంథనిలోని గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇటీవల మంథనిలో పర్యటించగా, పర్యాటక శాఖ కమిషనర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి సైతం రామగిరిని సందర్శించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.. మంత్రి శ్రీధర్‌బాబు సతీమణి కాగా, పర్యాటక శాఖ కమిషనర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడం.. మంథనికి కలిసివస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్,చిరంజీవి (ఫొటోలు)
-
తెలంగాణకు మణిహారంగా ఎక్స్పీరియం ఎకోపార్కు
శంకర్పల్లి: ‘ఎక్స్పీరియం ఎకోపార్కు’రాష్ట్రానికి మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాల నుంచి తెచ్చిన 25 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం’ఎకో పార్కును ప్రముఖ సినీనటుడు చిరంజీవి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పార్కు యజమాని రాందేవ్రావుతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంలో తిరుగుతూ పార్కును పరిశీలించారు.మొక్కల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వనజీవి రామయ్య దంపతులు, ఇటీవల గవర్నర్ పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణను సీఎం రేవంత్‌రెడ్డి, చిరంజీవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎక్స్పీరియం ఎకోపార్కు లోగో, కాఫీ టేబుల్‌బుక్‌ను ఆవిష్కరించారు. అయితే కార్యక్రమ ప్రారంబోత్సవంలో వేదికపైకి వనజీవి రామయ్యను పిలవకపోవడాన్ని గమనించిన సీఎం..వారిని వేదికపైకి పిలిచి గౌరవించారు. టూరిజంతోనే గుర్తింపు, ఆదాయం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించిందని, టూరిజంను అభివృద్ధి చేసేందుకు వనరులున్నా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టూరిజం ద్వారానే రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే నూతన టూరి జం (టెంపుల్, ఎకో, హెల్త్) పాలసీని తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంతంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని, ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని, ఇందుకోసం పెద్ద పెద్ద పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. 25ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఎక్స్పీరియం పార్కు యజమాని రాందేవ్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు.ఈ పార్కు తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతో దగ్గరగా ఉందని, ప్రస్తుతం 30 శాతం మాత్రమే పూర్తయిందని, ఏడాదిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. వనజీవి రామయ్య జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎం రమేశ్, అనిల్‌కుమార్, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నా సంపాదన అంతంతే: చిరంజీవి ‘రాందేవ్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. దేశ, విదేశాల్లోని మొక్కలను తీసుకొచ్చి చూపిస్తూ తీసుకోండి సార్ అనేవారు. అప్పుడు రూ.వేలల్లో ఉన్న మొక్కలు ధరలు, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. ప్రస్తుతం నా సంపాదన అంతంత మాత్రమే ఉంది. తర్వాత కొనుగోలు చేస్తానంటూ’మెగాస్టార్ చిరంజీవి చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.ప్రొద్దుటూరులో రాందేవ్రావు నిర్మించిన ఎక్స్పీరియం పార్కును చూడాలంటే కళా హృదయం ఉండాలని చిరంజీవి అన్నారు. తనకు ఈ ప్రాంతంతో 25 ఏళ్ల క్రితం నుంచి అనుబంధం ఉందన్నారు. 2000లో జీవం ఉన్న మొక్కలను అందించి రాందేవ్ తననే ఆశ్చర్యపరిచారని, ఆ మొక్కలు నేటికి తన గార్డెన్లో ఉన్నాయని తెలిపారు. షూటింగ్‌లకు అనుమతి ఇస్తారా అంటే తనకే ఫస్ట్ ఇస్తానని రాందేవ్ చెప్పారని, రానున్న రోజుల్లో ఇక్కడ షూటింగ్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపారు. -
కొత్తగూడెంలో ఎకో అడ్వెంచర్ పార్క్
లోతైన క్వారీలు, ఎత్తైన మట్టి దిబ్బలు, రాకాసి బొగ్గు, దుమ్మూ ధూళి.. సింగరేణి గనులు (Singareni Mines) అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇవే.. కానీ ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, సీతాకోక చిలుకల పార్కులకు (Butterfly Park) సింగరేణి పాత గనులు చిరునామాలుగా మారుతున్నాయి. మైనింగ్‌లో జరిగే నష్టాలను ఆయా సంస్థలే పూరించాలని కేంద్ర పర్యావరణ శాఖ తెచ్చిన నిబంధన మేరకు మూసివేసిన గనుల వద్ద సింగరేణి సంస్థ కొన్నాళ్లుగా భారీగా మొక్కలు నాటి అడవులు (Forests) పెంచుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందమైన ఎకో పార్కులను అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది. కొత్తగూడెంలో ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఎకో పార్క్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. - సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅందమైన వనాలు సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో రూ.3 కోట్లతో ఏర్పాటుచేసిన ఎకో పార్క్‌లో బటర్‌ఫ్లై గార్డెన్‌ను ఏర్పాటుచేశారు. ఎడారి, ఔషధ మొక్కలు, తాళ్లవనం (వివిధ దేశాలకు చెందిన తాటి చెట్లు), బోన్సాయ్ వంటి వివిధ దేశాల అరుదైన మొక్కలతో వేర్వేరు థీమ్‌లతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేశారు. పార్క్ ప్రాంగణంలోనే సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు కొలనులు ఉన్నాయి. సందర్శకులు ధ్యానం చేసుకునేందుకు బుద్ధవనం సిద్ధంగా ఉంది. వీటితోపాటు బర్డ్‌వాచ్ సెంటర్, వ్యూ పాయింట్, టాయిలెట్లు, కెఫటేరియాలు సిద్ధమయ్యాయి. పట్టణానికి దూరంగా నలువైపులా ఎత్తయిన కొండలు, దట్టంగా పరుచుకున్న చెట్ల నడుమ ఆధునిక సౌకర్యాలతో ఈ ఎకో పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి స్టడీ టూర్ల కోసం విద్యార్థులు వస్తున్నారు. టూరిజం శాఖకు అప్పగించే యోచనశ్రీరాంపూర్ ఏరియాలో మరో ఎకో పార్క్ (Eco Park) నిర్మా ణం జరుగుతోంది. ఈ రెండింటి తరహాలోనే సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఎకో పార్క్‌లను రెండుమూడేళ్లలో ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత భవిష్యత్‌లో మూతపడే ప్రతీ గని వద్ద ఇలాంటి పార్కులు నెలకొల్పుతారు. వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాక టూరిజం శాఖకు అప్పగించే యోచనలో సింగరేణి ఉంది. ఇప్పుడిప్పుడే ఎకో టూరిజం పుంజుకుంటుండటం,ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉండడంతో సింగరేణి సహకారం పర్యాటకరంగానికి మరిన్ని వన్నెలు అద్దనుంది.మైనింగ్‌పై అవగాహన కల్పించేలా.. ఎకో పార్క్ పక్కనే ఉన్న గౌతం ఖని ఓపెన్‌కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి దిబ్బలపై పెంచిన వనంలో సైక్లింగ్ ట్రాక్, నాలుగు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్లను అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఎకో అడ్వెంచర్ పార్క్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. పార్క్ సమీపంలో వెంకటేశ్ ఖని మెగా ఓపెన్‌కాస్ట్ త్వరలో మొదలుకానుంది. దీంతో ఓపెన్‌కాస్ట్ ఉపరితలంపై మరో వ్యూ పాయింట్ (View Point) సిద్ధం చేసి.. ప్రతీరోజు నిర్ణీత సమయంలో గనుల్లో జరిగే బ్లాస్టింగ్‌ను సందర్శకులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా మైనింగ్ ప్రక్రియలో అడవులు, భూమి, జలవనరులకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయి? వాటిని భర్తీ చేయడంలో సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి -
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా గండిపేట ఎకో పార్క్ (ఫొటోలు)
-
ఏడు వింతలే అని ఎవరు చెప్పారు? ఇది ఎనిమిదో వింత!
Kolkata Eco Park: ఈఫిల్ టవర్ చూడాలంటే... యూరప్ ట్రిప్ అక్కర్లేదిప్పుడు. వెస్ట్‌బెంగాల్ టూర్ చాలు. కోల్‌కతా నగరం... పారిస్ ఈఫిల్ టవర్‌కు ఏ మాత్రం తీసిపోని ప్రతిరూపాన్ని నిర్మించింది. విస్తారమైన పార్కింగ్ లాట్‌తో చాలా ముందుచూపుతో నిర్మించిన టూరిస్ట్ ప్రదేశం ఇది. ఎంట్రీ టికెట్ కేవలం ముప్పై రూపాయలు. పచ్చటి లాన్లలో చేతులు పట్టుకుని విహరించే పర్యాటక ప్రేమికులు, సరస్సులో బోట్ షికారు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లలు, పిల్లగాలికి మెల్లగా కదిలే తేలికపాటి అలలను ఆస్వాదించడానికి ఒడ్డున బెంచీల మీద సీనియర్ సిటిజెన్, సైకిల్ తీసుకుని ఆవరణ అంతా తిరిగి చూస్తున్న యూత్, మూడు ఎంట్రీ గేట్లు... ఈ దృశ్యమే ఈ పార్క్ మనం అనుకున్నంతకంటే ఇంకా చాలా పెద్దది కావచ్చేమోననే సందేహాన్ని కలిగిస్తుంది. ఈ టవర్ వ్యూ పాయింట్ నుంచి దాదాపుగా కోల్‌కతా నగరమంతటినీ చూడవచ్చు. రోమన్ కలోజియం నమూనా ఏడు వింతల ప్రతిరూపం ఈ ఎకో పార్క్ ఈఫిల్ టవర్ ప్రతిరూపంతో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతోపాటు ప్రపంచంలోని ఏడు వింతల కట్టడాలకూ ప్రతిరూపాలున్నాయి. లండన్ బిగ్‌బెన్ టవర్, జపాన్ గార్డెన్, బెంగాలీ గ్రామం, హెర్బల్ గార్డెన్లతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశం ఆనందమయమైన విహారానికి అధునాతనమైన వేదిక. మరో సంగతి! కోల్‌కతా ఈఫిల్ టవర్ గురించి తెలిసిన వెంటనే మనకు ఇండియాలో ఈఫిల్ టవర్ అనే ట్యాగ్‌లైన్ గుర్తుకువస్తుంది. కానీ ఇంతకంటే ముందు మనదేశంలో ఈఫిల్ టవర్‌కు మరో రెండు ప్రతిరూపాలున్నాయి. చండీగఢ్‌లో పన్నెండు మీటర్ల ఎత్తులో ఒకటి ఉంది. రాజస్థాన్ రాష్ట్రం కోట నగరంలో ఒకటి ఉంది. అయితే వీటన్నింటిలోకి కోల్‌కతాలోని ఈఫిల్ టవర్ ప్రతిరూపం మాత్రమే పారిస్‌లోని అసలు ఈఫిల్ టవర్‌ను అచ్చంగా మూసపోసినట్లు ఉంటుంది. ఎకోపార్కులోని ఈజిప్టు గిజా పిరమిడ్ నమూనా ఈఫిల్ టవర్ ప్రతిరూపం తోపాటు ఈ వింతలన్నీ కోల్‌కతాలోని ఎకో పార్కులో ఉన్నాయి. ఇక్కడి ఈఫిల్ టవర్ పద్దెనిమిది అంతస్థుల నిర్మాణం, ఎత్తు 55 మీటర్లు (పారిస్ టవర్ ఎత్తు 324 మీటర్లు). 2015లో మొదలు పెట్టి నాలుగేళ్లలో పూర్తి చేశారు. ఈ పార్కు 2020లో పర్యాటక ద్వారాలు తెరుచుకుంది . ∙ఎకోపార్కులోని తాజ్‌మహల్ నమూనా (పై ఫొటో) క్రైస్ట్ రిడీమర్ విగ్రహం దగ్గర టూరిస్ట్ -
ఈ–వేస్ట్ వినియోగానికి ఎకో పార్కు
పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకు కేంద్రం పరిశీలిస్తోంది: పర్యావరణ శాఖ న్యూఢిల్లీ: ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా ఉపయెగించుకు నేందుకు వీలుగా పునరుత్పత్తి చేసేందుకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఎకో పార్కును ఏర్పాటు సాధ్యా సాధ్యాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ ఓ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది. ఈ–వేస్ట్‌ను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలంటే పర్యావరణ అనుకూల (ఎకో)పార్కును ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, శిక్షణ పరికరాలు సమ కూర్చాల్సి ఉంటుందని క్రేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపినట్లు పర్యావరణ శాఖ చెప్పింది. ఎకోపార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఈ–వేస్ట్‌ను పర్యావరణహితంగా తయారు చేయొచ్చని పేర్కొంది. ప్రమాదకరమైన వస్తువుల నిర్వహణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఓ స్కీం ఉందని, అందులో ఈ–వేస్ట్‌ను పునరుత్పత్తి చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తాయని తెలిపింది.