సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్‌లు శుక్రవారం తెలిపారు.
తెలంగాణ ప్రాంత నేతలకు సోనియా సూచన
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్‌లు శుక్రవారం తెలిపారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. ఇలాఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కాంగ్రెస్ వెనకడుగు వేయబోదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ స్పష్టం చేశారు. 8 పార్టీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఆ తర్వాత తమ వైఖరులను మార్చుకున్నాయని విమర్శించారు.