నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోకండి | Don't beg for funds, ask alumni to contribute | Sakshi
Sakshi News home page

నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోకండి

Sep 16 2018 3:58 AM | Updated on Oct 2 2018 7:58 PM

Don't beg for funds, ask alumni to contribute - Sakshi

పుణే: విద్యాసంస్థలు నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుక్కునే బదులు తమ పూర్వ విద్యార్థులను ఆశ్రయించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ సూచించారు. శుక్రవారం ఇక్కడి జ్ఞాన ప్రబోధిని పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల నుంచి వర్సిటీల వరకు ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాలు కాదు.. అక్కడ చదువుకుని ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన పూర్వ విద్యార్థులే’అని ఆయన పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు సాయం కోసం విరామం లేకుండా ప్రభుత్వాన్ని అడుక్కుంటాయని, కానీ నిజమైన సాయం వారి వద్దే ఉందని చెప్పారు. తాము చదుకున్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం ఓ బాధ్యతగా తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement