అపోలో ఆసుపత్రిలో దారుణం | doctor raped a dengue patient in apollo hospital | Sakshi
Sakshi News home page

అపోలో ఆసుపత్రిలో దారుణం

Sep 9 2016 11:43 AM | Updated on Aug 20 2018 2:31 PM

అపోలో ఆసుపత్రిలో దారుణం - Sakshi

అపోలో ఆసుపత్రిలో దారుణం

అపోలో అసుపత్రికి డెంగ్యూ చికిత్స కోసం వచ్చిన మహిళపై అక్కడ పనిచేస్తున్న ఓ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అపోలో అసుపత్రికి డెంగ్యూ చికిత్స కోసం వచ్చిన మహిళపై అక్కడ పనిచేస్తున్న ఓ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాలు.. డెంగ్యూతో బాధపడుతున్న ఓ 21 ఏళ్ల మహిళ ఇటీవల చికిత్స కోసం అపోలో అసుపత్రిలో చేరింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెపై రాత్రివేళలో విధులు నిర్వర్తిస్తున్న రమేష్ చౌహాన్(28) అనే డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని వార్డు బాయ్ సహకారంతో డాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన డాక్టర్తో పాటు సహకరించిన వార్డు బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రిలో చేరిన ఆమెపై రెండుసార్లు అత్యాచారానిని పాల్పడినట్లు తెలుస్తోంది. మెడికల్ రిపోర్టులో సైతం ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement