బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్‌ క్యాప్‌..

Doctor Found Pen Cap In Boy Lungs At Kolkata - Sakshi

కోల్‌కతా: సాధారణంగా చిన్న పిల్లలు పెన్నుక్యాప్‌లను నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటడం చూస్తాం. కానీ, కొన్ని సార్లు పెన్నక్యాప్‌లు వారి శరీరంలోకి పోయి చాలా ప్రమాదకరంగా మారిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఓ బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్నుక్యాప్‌ ఉండటంలో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కోల్‌కతాలోని గారియా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడ్ని.. అతని తల్లిదండ్రులు స్థానిక ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యుడు డా.అరుణాభా సేన్‌గుప్తా బాలుడికి సిటీ స్కాన్‌ తీశారు. సిటీ స్కాన్‌ రిపొర్టు పరిశీలించగా.. బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్‌క్యాప్‌ ఉన్నట్లు తేలింది.

నవంబర్‌లో తమ బాలుడు పెన్‌క్యాప్‌ మింగినటట్లు తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు అతన్ని స్థానిక నర్సింగ్‌ హోంకి తీసుకువెళ్లారు. ఆ నర్సింగ్‌ హోం డాక్టర్లు.. బాలుడి శరీరంలో పెన్‌క్యాప్‌ ఉందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మాములుగా వైద్యం చేసి పంపించారు. పెన్‌క్యాప్‌ బాలుడి శరీరంలో ఉంటే ప్రాణాలతో ఉండేవాడు కాదని ఆ వైద్యులు తెలిపారు. దీంతో చేసేదేమి లేక బాలుడ్ని ఆ తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్లారు.

కానీ ఆ బాలుడికి రోజురోజుకి దగ్గు, జలుబు ఎక్కువ కావటంతో అతని తల్లిండ్రులు గురువారం స్థానిక ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడి ఎడమ ఊపిరితిత్తులో ఉన్న పెన్‌క్యాప్‌ను శుక్రవారం ఆపరేషన్‌ చేసి తొలగించామని డాక్టర్‌ అరుణాభాసేన్‌ గుప్తా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం  బాలుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.        

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top