వైద్యం చేతకాక చేయి తీసేశాడు | doctor amputes hand of four year old in bihar | Sakshi
Sakshi News home page

వైద్యం చేతకాక చేయి తీసేశాడు

Jan 29 2015 6:44 PM | Updated on Jul 18 2019 2:14 PM

వైద్యం చేతకాక చేయి తీసేశాడు - Sakshi

వైద్యం చేతకాక చేయి తీసేశాడు

డాక్టర్లు శస్త్రచికిత్సల సందర్భంగా కడుపులో కత్తెర్లు మర్చిపోవడం, గుండెలో గుర్తులేక సూదులు వదిలేయడం గతించిన చరిత్ర.

డాక్టర్లు శస్త్రచికిత్సల సందర్భంగా కడుపులో కత్తెర్లు మర్చిపోవడం, గుండెలో గుర్తులేక సూదులు వదిలేయడం గతించిన చరిత్ర, ఇప్పటి డాక్టర్లు వృత్తిని దైవంగా భావించి అప్రమత్తంగా తమ విధులు నిర్వహిస్తున్నారని భావిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో ఓ డాక్టర్  వైద్యం చేతకాక ఏకంగా ఓ నాలుగేళ్ల చిన్నారి చేతినే తీసేశాడు. నావడా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితమే ఈ ఘోరం జరిగింది. దీన్ని తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి తండ్రి ఉదయ్ ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం... నావడా జిల్లాలోని విశ్వన్‌పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ ప్రసాద్ నాలుగేళ్ల కూతురు ఆంచల్ కుమారికి నెలరోజుల క్రితం ఓ ప్రమాదంలో ఎడమచేయి విరిగి వాచింది. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా డాక్టర్ అరవింద్ కుమార్ వైద్యం చేస్తూ వచ్చారు. నెలరోజులైనా విరిగిన ఎముక అతుక్కోకపోగా వాపు కాస్తా ఇన్‌ఫెక్షన్‌కు దారితీసింది. డాక్టర్ మారు మాట్లాడకుండా ఆ చిన్నారి ఎడమ చేతిని శస్త్రచికిత్సతో తొలగించేశాడు. ఈ నిర్వాకంతో మండిపడిన ఆ చిన్నారి తండ్రి, ఇతర బంధువులు గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడంతో డాక్టర్ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement