ఈ టిక్‌టాక్‌ దీవానీని గుర్తుపట్టారా? 

Do you   know  that  Suspended Gujarat lady cop launches her own music video - Sakshi

టిక్‌ టాక్‌ వీడియోతో  ఉద్యోగం పోగొట్టుకున్న గుజరాత్‌కు చెందిన  పోలీసు కానిస్టేబుల్‌ అర్పితా చౌదరి గుర్తున్నారా?  ప్రస్తుతం ఇపుడు ఈమె ఉద్వాసనలు,  హెచ్చరికలను పక్కన పెట్టి  తనకిష‍్టమైన రంగంలో రాణించేందుకు సిద్ధమవుతోంది.  పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ వీడియో చేయడంతో పై అధికారుల ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా  మరో వీడియోతో  హల్‌ చల్‌  చేస్తోంది.  సొంతంగా ఒక మ్యూజిక్ వీడియోను చేసి విడుదల చేసింది.  టిక్‌టాక్ ని దివానీ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది.  విడుదలైన మూడు రోజుల్లోనే ఈ వీడియోకు 20లక్షల 50వేలకు పై గా  వ్యూస్‌తో దూసుకుపోతోంది.  ఇక ఈ పాటను జిగ్నేష్ కవిరాజ్ పాడగా.. మయూర్ నదియా సంగీతం అందించాడు. మను రబారి లిరిక్స్‌ను రాశాడట. 

చదవండి : టిక్‌టాక్‌ వీడియో; మహిళా పోలీసు సస్పెండ్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top