నేడు తమిళనాడు బంద్‌ | DMK Call for Tamil Nadu Bandh | Sakshi
Sakshi News home page

నేడు తమిళనాడు బంద్‌

May 25 2018 3:35 AM | Updated on May 25 2018 3:35 AM

DMK Call for Tamil Nadu Bandh - Sakshi

సచివాలయం ఎదుట స్టాలిన్‌ అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి హింసాకాండకు వ్యతిరేకంగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కాల్పులపై డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో చర్చించేందుకు సీఎం పళనిస్వామి నిరాకరించడంతో డీఎంకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సచివాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. స్టెరిలైట్‌ యూనిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి.  మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు స్టెరిలైట్‌ కర్మాగారానికి విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్‌ హాసన్‌ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement