మహారాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతి | disputes in Maharashtra congress | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతి

Jul 20 2014 10:11 PM | Updated on Mar 18 2019 7:55 PM

మహారాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతి - Sakshi

మహారాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతి

ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను తప్పించాలని మరో సీనియర్ నేత నారాయణ్ రాణే డిమాండ్ చేస్తున్నారు.

న్యూఢిల్లీ: అసలే లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ను తప్పించాలని మరో సీనియర్ నేత నారాయణ్ రాణే డిమాండ్ చేస్తున్నారు. లేకుంటు కేబినెట్ నుంచి వైదొలగుతానని హెచ్చరించాడు. దీంతో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకుని మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తున్నారు. ఇక తెలంగాణలో పీసీసీ చీఫ్ను మార్చాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
 

Advertisement
 
Advertisement
Advertisement