పెరిగిన బంగారు ఆభరణాల అమ్మకాలు | Dhanteras 2014: Gold Prices at Their Lowest in 3 Years; Customers Flock for Special Offers, Discounts | Sakshi
Sakshi News home page

పెరిగిన బంగారు ఆభరణాల అమ్మకాలు

Oct 22 2014 11:58 PM | Updated on Sep 2 2017 3:15 PM

పెరిగిన బంగారు ఆభరణాల అమ్మకాలు

పెరిగిన బంగారు ఆభరణాల అమ్మకాలు

ధనత్రయోదశిని పురస్కరించుకొని నగరంలో బంగారు ఆభరణాల విక్రయాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి.

సాక్షి, ముంబై : ధనత్రయోదశిని పురస్కరించుకొని నగరంలో బంగారు ఆభరణాల విక్రయాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బంగారం ధరలు గణనీయంగా తగ్గడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.4 వేల తగ్గింది. గత ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.32 వేల వరకు ఉన్నదని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెలరీ ట్రేడర్స్ ఫెడరేషన్ బోర్డ్ సభ్యుడు అశోక్ మినవాలా తెలిపారు.

గత కొన్ని నెలలుగా బంగారు విక్రయాలు పడిపోయాయని ధన్‌తిరస్ పురస్కరించుకొని తిరిగి విక్రయాలు పుంజుకున్నాయని గిర్గావ్‌కు చెందిన మరో వ్యాపారి తెలిపారు. ఎన్నో రోజులుగా పేరుకు పోయిన బంగారం ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో బంగారు ధర తగ్గి విక్రయాలు పుంజుకున్నాయని తెలిపారు. కాగా, ఈసారి చాలా మంది వినియోగదారులు బంగారు నాణేలనే ఎక్కువగా ఎంచుకున్నారన్నారు. దీపావళి అదేవిధంగా పెళ్లిళ్ల సీజన్ నిమిత్తం కొంత మంది ఆభరణాలను కొనుగోలు చేశారని విలేపార్లేకి చెందిన పి.ఎన్.గాడ్గిల్ జ్యూవెలర్స్ మేనేజర్ యశ్వంత్ సొనర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement