breaking news
All India Gem and jewellery Traders
-
పసిడికి ధన్‌తేరాస్ వెలుగులు
ముంబై/న్యూఢిల్లీ: ధన్‌తేరాస్ సందర్భంగా పసిడి, వెండికి డిమాండ్ నెలకొంది. పసిడి ధరలు ఇటీవల గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారడంతో అమ్మకాలు జోరందుకున్నట్లు ఆభరణాల విక్రేతలు వెల్లడించారు. ఈసారి బంగారం అమ్మకాలు ప్రాథమికంగా విలువపరంగా దాదాపు 15–20% పెరిగి రూ. 60,000 కోట్లకు చేరవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. అయితే, గతేడాది స్థాయితో పోలిస్తే ధరలు ఇంకా అధికంగానే ఉన్నందున పరిమాణంపరంగా చూస్తే మాత్రం పెద్దగా మార్పు ఉండదని వివరించారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలాంటి విలువైన లోహాలను కొనడం శుభకరంగా పరిగణిస్తారు. వినియోగదారులు ఎక్కువగా తేలికపాటి, 18 క్యారట్ ఆభరణాలు, అంతగా ఖరీదు ఉండని ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నట్లు రోక్డే వివరించారు. మరోవైపు, వెండి అమ్మకాలు విలువపరంగా 30%, పరిమాణంపరంగా 10% పెరగొచ్చని అంచనా వేశారు. అడ్వాన్స్ బుకింగ్‌ల దన్ను.. గతేడాదితో పోలిస్తే ఈసారి షోరూమ్‌లను సందర్శించే వారి సంఖ్య పెరిగిందని జీజేసీ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్స్ పటిష్టంగా ఉండటం కూడా ధన్‌తేరాస్ విక్రయాలకు దన్నుగా నిలి్చనట్లు వివరించారు. పశి్చమ, ఉత్తరాది మార్కెట్లలో కొనుగోళ్లు అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ధరలు కరెక్షన్‌కి లోను కావడంతో పండగ కొనుగోళ్లు పెరిగేందుకు దోహదపడినట్లు కల్యాణ్ జ్యువెల్లర్స్ ఈడీ రమేశ్ కల్యాణరామన్ చెప్పారు. కస్టమర్లు ఎక్కువగా పెండెంట్లు, గాజులు, చెయిన్లు, చిన్న పరిమాణంలో గోల్డ్, సిల్వర్ కాయిన్ల వైపు మొగ్గు చూపినట్లు వివరించారు. అమ్మకాల విలువ గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగినట్లు సేన్కో సీఈవో సువంకర్ సేన్ తెలిపారు. కస్టమర్లు పెద్ద ఎత్తున షోరూమ్‌లను సందర్శించడం, వివాహాల కోసం కొనుగోళ్లు చేసే వారు కూడా తోడు కావడం ఇందుకు దోహదపడినట్లు చెప్పారు.చిన్న నాణేలు, కడ్డీల వైపు మొగ్గు.. అటు ధరల తగ్గుదల, పటిష్టమైన బుకింగ్స్, దీపావళి సందర్భంగా సుదీర్ఘ వారాంతం రావడం తదితర అంశాలు విక్రయాలు పెరిగేందుకు తోడ్పడినట్లు పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. విలువపరంగా అమ్మకాలు 25–30 శాతం వృద్ధి చెంది ఉంటాయని పరిశ్రమ గణాంకాలను బట్టి సూచనప్రాయంగా తెలుస్తోందని పేర్కొన్నారు. పాత బంగారాన్ని మార్చుకోవడం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఒకేసారి పెద్ద మొత్తం పెట్టి భారీగా కొనడంకాకుండా, వివిధ ధరల్లో చిన్న చిన్న నాణేలు, కడ్డీలను కొనుక్కునే ధోరణి పెరుగుతోందని ఎంఎంటీసీ–పీఏఎంపీ ఎండీ సమీత్ గుహ తెలిపారు. పరిమాణంపరంగా అమ్మకాలు 30–35 శాతం, విలువపరంగా 45–50% పెరిగినట్లు పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరాం గర్గ్ తెలిపారు. పాత బంగారం మారి్పడి, పెళ్లిళ్ల డిమాండ్ మొదలైన అంశాలు పసిడికి దన్నుగా ఉన్నాయని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్ కిరీట్ భన్సాలీ పేర్కొన్నారు. -
పెరిగిన బంగారు ఆభరణాల అమ్మకాలు
సాక్షి, ముంబై : ధనత్రయోదశిని పురస్కరించుకొని నగరంలో బంగారు ఆభరణాల విక్రయాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బంగారం ధరలు గణనీయంగా తగ్గడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.4 వేల తగ్గింది. గత ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.32 వేల వరకు ఉన్నదని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెలరీ ట్రేడర్స్ ఫెడరేషన్ బోర్డ్ సభ్యుడు అశోక్ మినవాలా తెలిపారు. గత కొన్ని నెలలుగా బంగారు విక్రయాలు పడిపోయాయని ధన్తిరస్ పురస్కరించుకొని తిరిగి విక్రయాలు పుంజుకున్నాయని గిర్గావ్కు చెందిన మరో వ్యాపారి తెలిపారు. ఎన్నో రోజులుగా పేరుకు పోయిన బంగారం ఇప్పుడు మార్కెట్లోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో బంగారు ధర తగ్గి విక్రయాలు పుంజుకున్నాయని తెలిపారు. కాగా, ఈసారి చాలా మంది వినియోగదారులు బంగారు నాణేలనే ఎక్కువగా ఎంచుకున్నారన్నారు. దీపావళి అదేవిధంగా పెళ్లిళ్ల సీజన్ నిమిత్తం కొంత మంది ఆభరణాలను కొనుగోలు చేశారని విలేపార్లేకి చెందిన పి.ఎన్.గాడ్గిల్ జ్యూవెలర్స్ మేనేజర్ యశ్వంత్ సొనర్ తెలిపారు.


