బైక్‌ పార్కింగ్‌ చేయనీయలేదని.. | Delivery Boys Attacks Restaurant In South Delhi Argument Over Parking | Sakshi
Sakshi News home page

బైక్‌ పార్కింగ్‌ చేయనీయలేదని..

Jul 15 2018 6:13 PM | Updated on Jul 15 2018 8:04 PM

Delivery Boys Attacks Restaurant In South Delhi Argument Over Parking - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  బైక్‌ పార్కింగ్‌ విషయం గొడవపడి ఓ రెస్టారెండ్‌ను ధ్వంసం చేశారు డెలివరీ భాయ్స్‌. పార్కింగ్‌ చేయనీయనందుకు సుమారు 25 మంది డెలివరీ భాయ్స్‌ దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌పై దాడికి దిగాడు. అద్దాలు పగులగొట్టారు, కుర్చీలను గాలిలోకి విసేరాశారు. ఒక్కసారిగా దాడి జరగడంతో  రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లు భయానికి గురయ్యారని, వారికి ఎలాంటి హానీ జరగకుండా వంటగది ద్వారా బయటకు పంపించామని రెస్టారెంట్‌ యజమాని రోహిత్‌ తెలిపారు.

‘సాయంత్రం కావడంతో హోటల్ వెలుపల ట్రాఫిక్ జామ్ అయింది. తమ మోటార్ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో వారికి తెలియలేదు. బీట్ ఆఫీసర్ వారిని అక్కడ్నించి వెళ్లాల్సిందిగా కోరడంతో సమస్య మొదలైంది' అని రోహిత్ చెప్పారు. 

కాగా, పార్కింగ్‌కు నిరాకరించడంతో ఆగ్రహించిన డెలివరీ బాయ్స్ వెంటనే వాట్సాప్ గ్రూప్‌లోని 25 మందిని కాంటాక్ట్ చేశారు. వారంతా కలిసి రాత్రి 8.30గంటల సమయంలో రెస్టారెంట్‌పై దాడికి దిగారు. అద్దాలు పగులగొట్టారు. ఈ దాడి ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డెంది. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్‌లో సుమారు 30 మంది ఉన్నట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement