నిర్భయ కేసులో మూడేళ్లపాటు శిక్ష అనుభవించిన బాల నేరస్తుడు విడుదల కాకుండా కేంద్రం ప్రయత్నించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మూడేళ్లపాటు శిక్ష అనుభవించిన బాల నేరస్తుడు విడుదల కాకుండా కేంద్రం ప్రయత్నించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ‘ఈ విడుదలను ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు ముందు.. అదనపు సొలిసిటర్ జనరల్ ప్రభుత్వ వాదనను వినిపించారు. అయినా కోర్టు విడుదలకే మొగ్గు చూపింది.’ అని రిజిజు చెప్పారు.
కాగా, బాలనేరస్తుడిని శనివారం జువెనైల్ హోం నుంచి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. కోర్టు అధికారిక నిర్ణయం వెలవడ్డాక ఆదివారం ఆయన్ను విడుదల చేయనున్నారు. అయితే.. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై వాదనలను వినడానికి సుప్రీం కోర్టు సోమవారం అవకాశం కల్పించింది.