త్వ‌ర‌లోనే ఫ్లాస్మా ట్ర‌య‌ల్స్ : కేజ్రీవాల్‌

Delhi Will Start Plasma Transfusion Trials Says Arvind Kejriwal - Sakshi

సాక్షి, ఢిల్లీ :  క‌రోనా సోకిన వారికి త్వ‌ర‌లోనే ఫ్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్ర‌య‌ల్స్ ప్రారంభించామ‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ గురువారం ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమ‌తి ల‌భించింద‌ని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఇది విజ‌య‌వంత‌మైతే త్వ‌ర‌లోనే కరోనా రోగుల‌కు ఈ విధ‌మైన చికిత్స అందిస్తామ‌ని వెల్ల‌డించారు. రేష‌న్‌కార్డుల కోసం ఇప్ప‌టివ‌ర‌కు 15 ల‌క్ష‌ల‌మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని, ప్ర‌తిరోజు 10 లక్ష‌ల మందికి ఆహారాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీలో క‌రోనా బాధితుల ఆరోగ్యం మెరుగుప‌డుతోంద‌ని, 3-4 రోజుల్లో వారిని డిశ్చార్జ్ అవుతార‌ని పేర్కొన్నారు.

కాగా కరోనా నివారణకు మందు ఇంతవరకు ఎవరు కనుక్కొలేదు. ప్లాస్మా థెర‌పీలో క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా  ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది. ఇక భార‌త్‌లో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12, 380 కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 24 గంట‌ల్లోనే 941 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top