ఢిల్లీ అల్లర్లు: కేంద్రానికి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

Delhi Violence Army Should Be Called In CM Kejriwal Request To Center - Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో చెలరేగిన హింసతో భయం గుప్పిట్లో బతుకున్న దేశ రాజధాని ప్రజల్లో ధైర్యం నింపాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసుల బలం సరిపోవడం లేదని, వెంటనే ఆర్మీని రంగంలోకి దింపాలని ఆయన హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన లేఖ రాశారు. బుధవారం ఢిల్లీ తూర్పు ప్రాంతంలో కూడా ఘర్షణలు తలెత్తాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం. అల్లర్లను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్టు తెలిసింది. 
(చదవండి : సీఏఏ సెగ: సీబీఎస్‌ఈ పరీక్షల వాయిదా)

కాగా, గత మూడు రోజులుగా కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణల్లో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఢిల్లీ అల్లర్లను ఆపేందుకు గట్టి చర్యలు తీసుకోవాలంటూ జామియా మిలియా విద్యార్థులు కొందరు సీఎం కేజ్రీవాల్‌ ఇంటిముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదని, ఆందోళనకారులు సాధారణ ప్రజలను బెదిరిస్తూ.. దుకాణాలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లిపోయారని కొందరు వాపోయారు.
(చదవండి :ఢిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతుల సంఖ్య!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top