ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?

Delhi Metro can not incur losses over free rides to women - Sakshi

మహిళలకు ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయాణాలపై ఢిల్లీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు మెట్రోలో ఉచిత ప్రయాణం ఎందుకు? ఇలా ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భవిష్యత్తులో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎమ్‌ఆర్‌సీ)ను నష్టాల బాటలో నడిపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఉచిత’ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, ఇలాంటి ఉచిత తాయిలాలను ఉపేక్షించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది.

ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ కోసం భూసేకరణ చేయాలని, దానికి అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ‘ఆప్‌’ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ప్రయాణాల వల్ల దీర్ఘకాలంలో నష్టాలు తప్పవని, ఇలాంటి హామీలనిస్తూ కేంద్రం ఈ ఖర్చునంతా భరించాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మెట్రో, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గతంలో ప్రకటించడం తెల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top