ముక్కోణపు ప్రేమకథ.. లాయర్ను చంపేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ | Delhi lawyer killeed by her boyfriend's ex-lover | Sakshi
Sakshi News home page

ముక్కోణపు ప్రేమకథ.. లాయర్ను చంపేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్

Oct 20 2013 1:06 PM | Updated on Sep 1 2017 11:49 PM

ముక్కోణపు ప్రేమ కథ ఒకరి ప్రాణాలు బలి తీసుకోగా, మరో ఇద్దర్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది.

ముక్కోణపు ప్రేమ కథ ఒకరి ప్రాణాలు బలి తీసుకోగా, మరో ఇద్దర్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. మాజీ ప్రియుడిని దక్కించుకునేందుకు కోసం అతడి ప్రస్తుత ప్రియురాలని మాజీ ప్రేయసి దారుణంగా చంపేసింది. ముగ్గురూ ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవారే అయినా వివేకంగా కోల్పోయి రాక్షసంగా ప్రవర్తించారు. వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీకి చెందిన జుహీ ప్రసాద్ లాయర్. ఆమె పుణెకు చెందిన నీమేష్ సిన్హాను ప్రేమించేది. ఆమె కంటే ముందు నీమేష్..అనుశ్రీ కుంద్రా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ప్రేమించాడు. 2011 నవంబర్లో నీమేష్ ఫొన్ చేసి రమ్మనడంతో జుహీ పుణె వెళ్లింది. అతని ప్లాట్లో వారిద్దరూ ఓ రోజు గడిపారు. మరోసటి రోజు ఉదయం అనుశ్రీ నీమేష్ ప్లాట్కు వెళ్లి బెడ్రూంలో నిద్రిస్తున్న జుహీపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో జుహీ ప్రాణాలు కోల్పోయింది.

ఈ కేసులో నీమేష్ ప్రమేయం కూడా ఉందని, పథకం ప్రకారమే తన కుమార్తెను చంపేశారని జుహీ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీమేష్.. జుహీని కనీసం రక్షించేందుకు కూడా ప్రయత్నించలేదని, లేకుంగా కాలిన గాయాలతోనైనా తన కుమార్తె ప్రాణాలతో బయటపడేదని తెలిపారు. ఈ ముక్కోణపు కథ, హత్యపై విచారణ చేయాల్సిందిగా ముంబై హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement