‘పిల్‌ను రాజకీయ వ్యాజ్యంగా మార్చారు’ | Delhi HC dismisses Subramanian Swamy PIL in Sunanda Pushkar case | Sakshi
Sakshi News home page

‘పిల్‌ను రాజకీయ వ్యాజ్యంగా మార్చారు’

Oct 27 2017 3:32 AM | Updated on Sep 18 2019 3:04 PM

Delhi HC dismisses Subramanian Swamy PIL in Sunanda Pushkar case - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశీ థరూర్‌ భార్య సునందా పుష్కర్‌ హత్య కేసులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) స్వామి రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సునంద హత్య కేసులో ఆమె భర్త శశీ థరూర్‌ జోక్యాన్ని నివారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) జరుపుతున్న విచారణను పర్యవేక్షించాలని స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ ఎస్‌ మురళీధర్, ఐఎస్‌ మెహతాల ధర్మాసనం.. పిటిషనర్‌ కోర్టుకు సమర్పించిన ఆధారాలతో సిట్‌ విచారణను పర్యవేక్షించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తాను శశీ థరూర్, ఢిల్లీ పోలీసులపై చేసిన ఆరోపణలకు సంబంధించి`న రహస్య సమాచారాన్ని అఫిడవిట్‌ రూపంలో సమర్పిస్తానని స్వామి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement