‘వెయిటింగ్’ వెతలకు చెక్ | Czech to the waitings about trains | Sakshi
Sakshi News home page

‘వెయిటింగ్’ వెతలకు చెక్

Feb 15 2016 12:38 AM | Updated on Sep 3 2017 5:39 PM

‘వెయిటింగ్’ వెతలకు చెక్

‘వెయిటింగ్’ వెతలకు చెక్

రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాల్సిందే. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందామనుకునే సరికి అప్పటికే వెయిటింగ్‌లో ఉంటే..!

కోల్‌కతా: రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాల్సిందే. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందామనుకునే సరికి అప్పటికే వెయిటింగ్‌లో ఉంటే..! వేరే స్టేషన్ నుంచి బెర్త్‌లు ఖాళీగా ఉండే వీలుంది కదా..! మరి ఖాళీగా ఉండే స్టేషన్లను ఎలా కనుక్కోవాలి? కష్టపడి కనుక్కున్నా అప్పటిలోగా ఆ స్టేషన్‌లో బెర్త్‌లు ఖాళీగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఈ బాధలు లేకుండా సులువుగా ఈ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇద్దరు విద్యార్థులు కొత్త మొబైల్ యాప్ కనిపెట్టారు. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి జాజు, జంషెడ్‌పూర్ ఎన్‌ఐటీలో చదివిన అతని సోదరుడు శుభం బల్దావా కలసి ‘టికెట్ జుగాద్’ అనే యాప్‌ను రూపొందించారు.

రైలు బయలుదేరిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను యాప్ చెప్తుంది. మనం టికెట్ బుక్ చేసుకునే సమయానికి ఏ స్టేషన్‌లో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో వెల్లడిస్తుంది. ఒక స్టేషన్ నుంచి బెర్తులు లేకపోయినా వేరే స్టేషన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. దీంతో వెయిటింగ్ లిస్ట్ బాధ పోతుంది. టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అంటూ ప్రతి రోజూ చెకింగ్ అనవసరం. యాప్ డౌన్‌లోడ్, బెర్తుల వివరాలు పూర్తిగా ఉచితం.

 ఆన్‌లైన్ ఇంధన నిర్వహణ వ్యవస్థ!
 న్యూఢిల్లీ: ఇంధన వినియోగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఆన్‌లైన్ ఇంధన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఇంధన నిర్వహణ వ్యవస్థ గురించి ఈ నెల 25న  ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌లో మంత్రి ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement