బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నుల కోత! | Cut corporate taxes in the budget! | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నుల కోత!

Jan 31 2017 4:40 AM | Updated on Sep 5 2017 2:29 AM

బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నుల కోత!

బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నుల కోత!

వచ్చే బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్ను కోతలు ఉండే అవకాశం ఉందని బ్రిటన్ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ), బ్రిటన్ పారిశ్రామిక సమాఖ్య (సీబీఐ)లు అంచనా వేస్తున్నాయి.

యూకేఐబీసీ
న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్ను కోతలు ఉండే అవకాశం ఉందని బ్రిటన్  ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ), బ్రిటన్  పారిశ్రామిక సమాఖ్య (సీబీఐ)లు అంచనా వేస్తున్నాయి. దీనితోపాటు సరళతర, సంక్లిష్టతలకు తావులేని పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టాలని తద్వారా భారత్‌లో బ్రిటన్  ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశాయి. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని పటిష్టంగా, ఎటువంటి అవాంతరాలూ లేకుండా అమలు చేయాలని కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. దీనివల్ల దేశంలో వ్యాపార విశ్వాసం  మెరుగుపడుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశీయ పెట్టుబడులు మెరుగుపడతాయని వివరించింది.

ఇబ్బందులూ ఉన్నాయ్‌...
భారత్‌ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, న్యాయ, నియంత్రణ, పన్ను అంశాలో ఇంకా పలు అస్పష్టతలు, సంక్లిష్టతలు ఉన్నాయని యుకేఐబీసీ చీఫ్‌ పాట్రిసియా హీవిట్‌ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో పోటీ పూర్వక వ్యాపార వాతావరణాన్ని బడ్జెట్‌ తీసుకువస్తుందని, విదేశీ ఇన్వెస్టర్ల హక్కుల రక్షణకు చర్యలు ఉంటాయని బ్రిటన్  సంస్థలు భావిస్తున్నట్లు సీబీఐ డైరెక్టర్‌ జనరల్‌ ఫైర్‌బ్రెన్  అన్నారు. బడ్జెట్‌లో బ్రిటన్  సంస్థలు ఏమి కోరుకుంటున్నాయన్న అంశాలను ఇప్పటికే రెండు వాణిజ్య ప్రాతినిధ్య సంస్థలు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సమర్పించాయి. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్‌ పన్నును ఆర్థికమంత్రి తన వచ్చే బడ్జెట్‌ నుంచీ దశలవారీగా 25 శాతానికి తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement