జమ్మూలో కర్ఫ్యూ విధించిన పోలీసులు | Curfew imposed in Jammu after communal clashes | Sakshi
Sakshi News home page

జమ్మూలో కర్ఫ్యూ విధించిన పోలీసులు

Aug 21 2015 10:34 AM | Updated on Sep 3 2017 7:52 AM

జమ్మూ - కశ్మీర్లోని సాంబా జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

జమ్మూ: జమ్మూ - కశ్మీర్లోని సాంబా జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు  అధికార వర్గాలు తెలిపాయి. సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ప్రజల మధ్య ఘర్షణ చెలరేగడంతోనే కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. నిరసనకారులు జిల్లా మెజిస్ట్రేటు వాహనంపై దాడులు చేశారు. ఈ దాడిలో మెజిస్ట్రేట్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది.


అంతే కాకుండా ఈ ఘర్షణలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు కల్పించుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. బారి బ్రాహ్మణ ప్రాంతంలో మత గ్రంథాల మీద ఆరోపణలతో రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. అది కాస్తం పెద్దదై నిరసనల హోరుతో మెజిస్ట్రేట్ కార్యాలయం దాకా వెళ్లింది. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు కల్పించుకుని కర్ఫ్యూ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement