కుటుంబ సభ్యుల కళ్లెదుటే కిరాతకంగా... | CPI(M), RSS worker hacked to death in Kerala’s Kannur | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యుల కళ్లెదుటే కిరాతకంగా...

Jul 12 2016 11:27 AM | Updated on Mar 29 2019 5:33 PM

కుటుంబ సభ్యుల కళ్లెదుటే కిరాతకంగా... - Sakshi

కుటుంబ సభ్యుల కళ్లెదుటే కిరాతకంగా...

కుటుంబ సభ్యుల కళ్ల ముందే సీపీఎం కార్యకర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కన్నూర్: కేరళలో హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా కన్నూర్ జిల్లాలో జరిగిన ఘటనల్లో సీపీఎం, బీజేపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. పయానుర్ ప్రాంతంలో సీపీఎం కార్యకర్త ధనరాజ్(32)ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మంగళవారం రాత్రి ధనరాజ్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే అతడిని కిరాతకంగా హత్య చేశారు.

ఇది జరిగిన కొద్ది గంటల తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్న ఆటోడ్రైవర్ సీకే రామచంద్రన్ కూడా ఇదేవిధంగా హత్యకు గురైయ్యాడు. హత్యారాజకీయాలపై సీపీఎం, బీజేపీ పరస్పరం నిందించుకున్నాయి. నేడు పయానూర్ బంద్ కు రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హత్యారాజకీయాలకు గత రెండు దశాబ్దాల్లో కన్నూర్ జిల్లాలో కనీసం 200 మంది సీపీఎం, బీజేపీ కార్యకర్తలు బలైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement