కేజ్రివాల్‌కు కోర్టు సమన్లు | Court summons Kejriwal | Sakshi
Sakshi News home page

కేజ్రివాల్‌కు కోర్టు సమన్లు

Mar 6 2017 4:22 PM | Updated on Sep 5 2017 5:21 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌కు సోమవారం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌కు సోమవారం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌  సమన్లు జారీ చేసింది. జూలై 29 లోపు కోర్టులో హాజరు కావలని  ఆదేశించింది. కేజ్రివాల్‌ తప్పడు ఆరోపణలు చేశారంటూ రాజ్య సభ ఎంపీ, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మెన్‌ సుభాష్‌ చంద్ర పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కేజ్రివాల్‌ గతేడాది నవంబర్‌ 11న ప్రెస్‌ మీట్‌లో తన వద్ద నల్లడబ్బు ఉందని, నోట్లరద్దు విషయం తనకు ముందే తెలుసనే అవాస్తవాలు మాట్లాడారని చంద్ర పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇది తన పరువుకు భంగం కల్గిందని భారత పీనల్‌ కోడ్‌ 500 సెక్షన్‌ కింద  కేజ్రివాల్‌పై పరువు నష్టం కేసు పెట్టారు. దీన్ని విచారించిన కోర్టు కేజ్రివాల్‌కు సమన్లు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement