భారత్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు.. | Coronavirus Positive Cases Rises To 1024 In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు..

Mar 29 2020 9:37 PM | Updated on Mar 29 2020 9:38 PM

Coronavirus Positive Cases Rises To 1024 In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు భారత్‌లో 1024 మందికి కరోనా సోకిందని, 27 మంది మృతిచెందాని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా పాజిటివ్‌గా తేలి చికిత్స పొందినవారిలో 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది. మరోవైపు కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదివారం ఆదేశాలు జారీచేసింది. 

చదవం‍డి : ఆ 11 మంది రేపు డిశ్చార్జ్‌ : కేసీఆర్‌

లాక్‌డౌన్‌: కేంద్రం కీలక ఆదేశాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement