లాక్‌డౌన్‌: కేంద్రం కీలక ఆదేశాలు!

Coronavirus Centre Orders All States Over Lockdown Implementation - Sakshi

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.
(చదవండి: వాహనదారుల కట్టడికి పోలీసులు కొత్త ప్రయత్నం

రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపంది. కాగా, దేశవ్యాప్తంగా 987 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 25 మరణాలు సంభవించాయి.
(చదవండి: క్యా‘కరోనా’- ఈ పరుగు ఆగెదెన్నడు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top