వలస కార్మికులతో పెరిగిన కరోనా కేసులు

Coronavirus Cases Increased In UP Due To Immigrants Worker - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారాత్‌ ఆయీ హై, వ్యవస్థా కర్నీ హోగీ ( పెళ్లి బృందం వచ్చింది. ఏర్పాట్లు చేయాల్సిందే)’ జాన్‌పూర్‌ జిల్లా ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రామాజీ పాండే వ్యాఖ్యానించారు. ‘తక్షణమే పది పడకలు వేయండీ, రాత్రికల్లా వంద పడకలు సిద్ధం చేయాలి’ అని ఆయన తన సిబ్బందికి హుటాహిటిన ఆదేశాలు జారీ చేశారు. ‘ 25 భోజనాలు తగ్గితే ఎలా? అసలు నీవు రోజుకు ఎన్ని భోజనాలు సరఫరా చేయగలవు?’ అంటూ ఆయన ఓ వంట వాడిని ఉద్దేశించి ప్రశ్నించారు. (చదవండి : పది కోట్ల మందికి కరోనా ముప్పు!)

ఆయన చేస్తున్న హడావిడి అంత పెళ్లివారి కోసం కాదని, ముంబై, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చిన వలస కార్మికులకు జరపుతున్న వైద్య పరీక్షల్లో తేలుతున్న కరోనా కేసుల గురించి. గత ఆదివారం నాటికి ఈ మూడు ప్రాంతాల నుంచి దాదాపు రెండున్నర లక్షల మంది కార్మికులు యూపీకి తిరిగొచ్చారు. వారి రాకతో జాన్‌పూర్‌లో కూడా కరోనా కేసులు హఠాత్తుగా పెరిగాయి. మే 15వ తేదీ నాటికి ఆ జిల్లాలో కేవలం 18 కేసులే ఉండగా, జూన్‌ ఏడవ తేదీ నాటికి కరోనా కేసులు 284కు చేరుకున్నాయి. వాటిలో 249 కేసులు వలస కార్మికులవే. జూన్‌ 9వ తేదీ నాటికి ఆ కేసుల సంఖ్య 301 చేరుకున్నాయి. (చదవండి : ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..)

దాంతో జాన్‌పూర్‌ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కలిగిన జిల్లాగా మారిపోయింది. కరోనా పరీక్షలకు జాన్‌పూర్‌ ఆస్పత్రిలో ఒకే ఒక ఆస్పత్రి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు దాదాపు రెండు వేల మంది అనుమానితుల నుంచి శాంపిల్స్‌ను తీసుకుంటున్నప్పటికీ 25 శాంపిల్స్‌ మాత్రమే ల్యాబ్‌ సిబ్బంది పరీక్షించ గలుగుతున్నారు. దాంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కరోనా అనుమానితులకు ‘కల్‌ హాజావో, నయీ పర్సుం ఆజావో’ అంటూ ల్యాబ్‌ సిబ్బంది నుంచి సమాధానాలు వస్తున్నాయి. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top