'అమ్మో.. బతికి బయటపడ్డారు' | Cops escape landmine attack by Maoists in Bihar | Sakshi
Sakshi News home page

'అమ్మో.. బతికి బయటపడ్డారు'

Apr 10 2015 12:43 PM | Updated on Oct 9 2018 2:51 PM

తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాస్తంత వేగంగా ఉన్నట్లయితే వారి ప్రాణాలు గాల్లోకలిసిపోయేవే.

గయ: తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాస్తంత వేగంగా ఉన్నట్లయితే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. బీహార్లో మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్న పోలీసులు కొంత సమయం ఆలస్యం, కొద్ది మీటర్ల దూరంతో ఉండటంవల్ల మందుపాతర పేలుళ్ల బారినుంచి తప్పించుకున్నారు.

బీహార్లోని గయ జిల్లాలో మావోయిస్టుల గాలింపులు చేపడుతున్న పోలీసులు శుక్రవారం బిర్నావన్ అనే గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి ఒక్కసారిగా మావోయిస్టులు రెండు శక్తిమంత మందుపాతరలు పేల్చివేశారు. ఇది పోలీసు వాహనాలకు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగింది. దీంతో షాక్కు గురైన పోలీసులు వెంటనే తేరుకుని అప్రమత్తమై ఆ చుట్టుపక్కల కొద్ది సేపు సోదాలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement