కాంగ్రెస్ నేత హత్య | Congress leader shot dead in Azamgarh | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేత హత్య

Dec 19 2015 4:23 PM | Updated on Sep 3 2017 2:15 PM

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ నేత హత్య కలకలం రేపింది. యుపీసీసీ సీనియర్ నేత రాజ్ నరేన్ సింగ్(52)ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ లో  కాంగ్రెస్ నేత హత్య కలకలం రేపింది. యుపీసీసీ సీనియర్ నేత రాజ్ నరేన్ సింగ్(52)ను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.  ఒకపక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు కావడంతో దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మునిగి తేలుతోంటే...  ఆజాంఘర్ లో మాత్రం విషాదం అలుముకుంది.

శనివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయనపై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో  నరేన్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. విచారణ జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  1993   ఎన్నికల్లో   రాజ్ నారాయణ ...లాల్గంజ్  అసెంబ్లీ నియెజకవర్గం నుంచి  పార్టీ తరపున పోటీ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement