'కాంగ్రెస్ పార్టీది చిన్న హృదయం' | Cong showed small heart by not inviting narendra Modi to Jawaharlal Nehru event, Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ పార్టీది చిన్న హృదయం'

Nov 13 2014 8:21 PM | Updated on Mar 29 2019 9:24 PM

'కాంగ్రెస్ పార్టీది చిన్న హృదయం' - Sakshi

'కాంగ్రెస్ పార్టీది చిన్న హృదయం'

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 125 జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఆహ్వానించకపోవటాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుబట్టారు.

గాంధీనగర్:మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 125 జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఆహ్వానించకపోవటాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమైందంటూ విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీది చాలా చిన్న హృదయం. దేశ తొలి ప్రధాని నెహ్రూ జయంతి ఉత్సవాలకు ప్రస్తుతం ప్రధాని మోదీని ఆహ్వానించలేదు. ఇది కాంగ్రెస్ వైఖరిని తెలియజేస్తోంది' అని వెంకయ్య ఎద్దేవా చేశారు.

 

గుజరాత్ లో జరుగుతున్న రాష్ట్ర వేడుకకు మోదీని విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ ఆదర్శాలు వేరంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తిప్పికొట్టారు. దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఏ పార్టీ అయితే ఏంటని ప్రశ్నించారు. భారతదేశంలో చాలా రాజకీయ పార్టీల ఉన్నాయని ప్రతీ పార్టీకి ఒక్కో ఆదర్శం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement