రూ. 2000 నోటు రంగు పోతోంది! | Colour Losing of Rs 2000 Notes? | Sakshi
Sakshi News home page

రూ. 2000 నోటు రంగు పోతోంది!

Feb 26 2017 8:15 AM | Updated on Sep 5 2017 4:35 AM

రూ. 2000 నోటు రంగు పోతోంది!

రూ. 2000 నోటు రంగు పోతోంది!

ఏటీఎంలో వచ్చిన రూ.2,000 నోటు రంగు పోతోందని ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

షాజహాన్ పూర్‌: ఏటీఎంలో వచ్చిన రూ.2,000 నోటు రంగు పోతోందని ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రితిక్‌ గుప్తా అనే వ్యక్తి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు తీయగా ఐదు రూ.2,000 నోట్లు వచ్చాయి. వాటిలో ఒక దాని రంగు పోతోందని రితిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అది దొంగనోటు కాదనీ, రంగు పోతున్నట్లుగా ఫిర్యాదు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఏటీఎంలో దొంగనోట్లు వచ్చే అవకాశం లేదని బ్యాంక్‌ ప్రాంతీయ మేనేజర్‌ చెప్పారు. ఇటీవలే రిజర్వు బ్యాంకు బదులు చిల్ర్డన్  బ్యాంకు అని రాసి ఉన్న నాలుగు నోట్లు ఢిల్లీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో రావడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement