‘నవ భారత కలను నిజం చేసే బడ్జెట్‌’ | UP CM Yogi Adityanath Praises Interim Budget 2019 | Sakshi
Sakshi News home page

‘నవ భారత కలను నిజం చేసే బడ్జెట్‌’

Feb 1 2019 1:23 PM | Updated on Feb 1 2019 1:25 PM

UP CM Yogi Adityanath Praises Interim Budget 2019 - Sakshi

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కార్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. శుక్రవారం పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభినందించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదలు, రైతులు, కార్మికులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ ‘నవ భారత’ కలను నిజం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను ఎన్నికల బడ్జెట్‌గా వర్ణిస్తున్నారు. రైతులకు, కార్మికులకు, మధ్య వయసు వారికి, వేతన జీవులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించడంలో మోదీ ప్రభుత్వం సక్సెస​ అయ్యిందని విశ్లేషిస్తున్నారు. డిమానిటైజేషన్‌ నష్టాలను పూడ్చుకునేందుకు మోదీ చేసిన ప్రయత్నం స్పష్టంగా కన్పిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement