పరిశుభ్రమైన భారత్కు వారణాశి నుంచే శ్రీకారం చుడతానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు.
వారణాశి: పరిశుభ్రమైన భారత్కు వారణాశి నుంచే శ్రీకారం చుడతానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీకి చరిత్రాత్మక విజయం అందిచి.. వారణాశి లోక్సభ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన మోడీ శనివారం ఇక్కడికి వచ్చారు.
2019లో గాంధీ 150వ జయంతి నాటికి పరిశుభ్రమైన భారత్గా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. గంగానదిలో పూజలు నిర్వహించిన అనంతరం కాశీ విశ్వనాథుడిని సందర్శించుకున్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో తాను ఘనవిజయం సాధించానని చెప్పారు. ఎన్నికల ప్రచార సందర్భంగా తనను మాట్లాడకుండా చేసినా ఓటర్లు భారీ మెజార్టీ అందించి ఆదరించారని కృతజ్ఞతలు చెప్పారు. అంతకుముందు నగరంలో మోడీ రోడ్ షో నిర్వహించారు.