వందల్లో ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోరా?

Chief Swati Maliwal Meets Police Officials Over Delhi Violence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా సంఘం చీఫ్‌ కమిషనర్‌ స్వాతి మాలివాల్‌ బుధవారం ఢిల్లీ అధికారులను కలిశారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ వల్ల ఒత్తిడికి లోనవుతున్న బాధిత మహిళల నుంచి తమ ప్యానల్‌కు ముకుమ్ముడిగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులకు తెలిపారు. అదే విధంగా స్పెషల్‌ పోలీసు కమిషనర్‌(శాంతి భద్రతల) అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవను కూడా డీసీపీ కార్యాలయంలో కలిశారు. ఈ క్రమంలో కరావల్‌ నగర్‌, దయల్పూర్‌, భజన్‌పురా, గోకుల్‌పురి ఇతర ప్రాంతాల మహిళల నుంచి వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయనకు వెల్లడించారు. 
సీఏఏ అల్లర్లు : సీబీఎస్‌ఈ పరీక్ష వాయిదా

ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌గా ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ

ఈ సందర్బంగా మాలివాల్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘మా కమిషన్‌కు పలు ప్రాంతాల మహిళలు తరచూ 181 హెల్స్‌ లైన్‌ ద్వారా నిరంతరం ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులకు పంపిస్తున్నాము. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సీలాంపూర్‌లో ఉన్నత పోలీసు అధికారులను కలిసి విషయం వివరించాము’ అని చెప్పారు.  అంతేగాక పోలీసుల తీరుపై అసంతృప్తి చెందిన మాలివాల్‌.. తన కమిషన్‌ సభ్యులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లానని, అక్కడ అల్లర్ల వల్ల పరిస్థితులు తీవ్రంగా మారాయని తెలిపారు. ఇక ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాను సీనియర్‌ పోలీసు అధికారులను కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవను కలిసి తమకు వచ్చిన ఫిర్యాదులన్నింటిని ఆయనకు అందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కాగా ప్రతి ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక ప్రతి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్‌కు ఇవ్వాల్సిందిగా తన బృందానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top