రెచ్చిపోయిన మావోయిస్టులు | Chhattisgarh: Naxals attack NMDC mines | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మావోయిస్టులు

Aug 3 2015 10:22 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా బచేలీ వద్ద ఎన్ఎండీసీ గనులపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు.

ఛత్తీస్గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా బచేలీ వద్ద  ఎన్ఎండీసీ గనులపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి 11 గంటల సమయంలో దాదాపు 40 మంది మావోయిస్టులు ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు. ఎన్ఎండీసీ డ్రిల్ మిషన్, ఇతర సామాగ్రిని తగులబెట్టారు.

ఈ దాడిలో సుమారు 50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరవైపు... మావోయిస్టులపై  సీఐఎస్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇరు వర్గాలు మధ్య దాదాపు 3 గంటల పాటు కాల్పులు కొనసాగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement