కొలీజియం సిఫారసును తిప్పిపంపిన కేంద్రం | centre rejects colleaseum recommendation | Sakshi
Sakshi News home page

కొలీజియం సిఫారసును తిప్పిపంపిన కేంద్రం

Jun 20 2014 1:46 AM | Updated on Sep 2 2018 5:50 PM

సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ గోపాల్ సుబ్రమణ్యం నియామకానికి కొలీజియం చేసిన సిఫారసును కేంద్రం తిప్పి పంపినట్లు సమాచారం.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ గోపాల్ సుబ్రమణ్యం నియామకానికి కొలీజియం చేసిన సిఫారసును కేంద్రం తిప్పి పంపినట్లు సమాచారం. గతంలో సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించిన గోపాల్ సుబ్రమణ్యం విషయంలో నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియాన్ని కేంద్రం కోరింది. అయితే ఆ జాబితాలోని ఇతరుల నియామకానికి మాత్రం అనుమతినిచ్చింది. వీరిలో కలకత్తా, ఒడిశా ప్రధాన న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఆదర్శ్ కుమార్ గోయల్‌లతో పాటు సీనియర్ న్యాయవాది రోహింటన్ నారిమన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement