కేంద్ర మంత్రి రాజీనామా | central minister reseighn | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి రాజీనామా

May 22 2016 6:04 PM | Updated on Sep 4 2017 12:41 AM

కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తన పదవికి రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ:  కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. మరో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కు అదనంగా క్రీడా, యువజన శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు సర్బానంద అస్సాం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో సాధించడంలో సర్బానంద క్రియాశీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement